కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా వెస్టిండీస్ పర్యటన..

dhawan
Last Updated: ఆదివారం, 21 జులై 2019 (14:53 IST)
విరాట్ కోహ్లీ సారథ్యంలోనే భారత క్రికెట్ జట్టు కరేబియన్ దీవుల్లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం మూడు ఫార్మెట్లకు జట్టును ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు ట్వంటీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ పర్యటన వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభంకానుంది.

ఈ పర్యటన కోసం జట్టును ప్రకటించారు. ఇందులో గత ప్రపంచ కప్ టోర్నీ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మహేంద్రసింగ్‌ ధోనీ స్థానంలో రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. ఈ టోర్నీకి తనను ఎంపిక చేయొద్దంటూ ధోనీ వినతి మేరకు ఆయన్ను పక్కనబెట్టేశారు. కాగా మూడు ఫార్మెట్లకు ప్రకటించిన జట్లు వివరాలను పరిశీలిస్తే,

ట్వంటీ20 టీమ్..
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ.

వన్డే జట్టు..
విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవ్‌దీప్‌ సైనీ.

టెస్టు జట్టు..
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, హనుమ విహారి, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.దీనిపై మరింత చదవండి :