మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (13:37 IST)

సూపర్ ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ... అక్కడే అతని శ్వాస ఆగిపోయింది..

ఇంగ్లండ్- కివీస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠను తట్టుకోలేక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ చిన్ననాటి కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ కన్నుమూశాడు.

ఈ విషయాన్ని జేమ్స్ గోర్డాన్ కుమార్తె లియోనీ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సూపర్ ఓవర్ ఉత్కంఠను తట్టుకోలేక ఆయన మరణించినట్లు ధ్రువీకరించింది. 
 
సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో నర్స్ తన వద్దకు వచ్చి తండ్రిగారి శ్వాసలో మార్పు వచ్చిందని తెలిపినట్లు లియోనీ వెల్లడించింది. తనకు తెలిసి సూపర్ ఓవర్‌లో జేమ్స్ నీషమ్ రెండో బంతికి బాదిన సిక్స్‌తో ఆయన తుది శ్వాసను తీసుకున్నాడని భావిస్తున్నానని తెలిపింది. 
 
అక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ అయిన డేవిడ్ జేమ్స్ గోర్డాన్ జేమ్స్ నీషమ్‌కు చిన్నతనంలో కోచ్‌గా వ్యవహారించారు. తన చిన్ననాటి కోచ్ కన్నుమూశాడన్న వార్త తెలిసిన జేమ్స్ నీషమ్ ట్విట్టర్‌లో స్పందించాడు. డేవ్ గోర్డాన్ తన హైస్కూల్ టీచర్ మాత్రమే కాకుండా.. మంచి కోచ్, మంచి స్నేహితుడని.. ఆట పట్ల ఆయకున్న ప్రేమ అద్భుతమని వ్యాఖ్యానించాడు. 
 
అలాంటి వ్యక్తి కోచింగ్‌లో ఆడటం తన అదృష్టమని.. మ్యాచ్ తర్వాత అభినందించిన తీరు ఇప్పటికీ గుర్తు. తనను చూసి మీరు గర్వించారని భావిస్తున్నా. ప్రతిదానికి ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ.. జేమ్స్ నీషమ్ ట్వీట్ చేశాడు. జేమ్స్ నీషమ్‌తో పాటు లుకీ ఫెర్గుగన్ కూడా హైస్కూల్ రోజుల్లో గోర్డానే కోచింగ్ ఇవ్వడం విశేషం.