సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (18:35 IST)

మళ్లీ వార్తల్లో నిలిచిన అశ్విన్.. విచిత్రంగా బౌలింగ్ చేశాడు.. గెలుపు కోసం..?

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)లో విచిత్రంగా బౌలింగ్ చేసి అభిమానులను విస్మయానికి గురిచేశాడు. ఐపీఎల్‌లో మన్కడింగ్‌తో వివాదాన్ని రేపిన అశ్విన్.. తాజాగా గెలుపు కోసం తప్పుడు మార్గంలో బౌలింగ్ చేశాడు. బంతిని విచిత్రంగా విసిరాడు. 
 
ప్రస్తుతం అశ్విన్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అశ్విన్ ఏం చేస్తున్నాడు.. బౌలింగ్ చేస్తున్నాడా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
 
టీఎన్‌పీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డుండిగల్‌ డ్రాగన్స్‌తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు తలపడింది. డుండిగల్‌ డ్రాగన్స్‌ విజయానికి 2 బంతుల్లో 17 చేయాల్సిన సమయంలో ఆ జట్టు అశ్విన్‌ విచిత్రంగా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. 
 
పుల్ యాక్షన్‌తో కాకుండా బంతిని విసిరాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. గెలుపు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటావా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 
ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డ్రాగన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. అనంతరం చేపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. దీంతో డ్రాగన్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.