1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 7 జులై 2025 (17:04 IST)

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Nabha Natesh
Nabha Natesh
ప్రముఖ మేగజైన్ ఎలీ ఇండియా తన జూలై ఎడిషన్ కవర్ పేజీపై బ్యూటిపుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ ను పబ్లిష్ చేసింది. తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సౌత్ ఇండియన్ సినిమాలో నభా తనదైన ప్రత్యేకతను సంపాదించుకుందని ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీ స్టోరీలో పేర్కొంది. ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ కావడం నభా నటేష్ కు దక్కిన మరో గౌరవంగా భావించవచ్చు. ఇటీవలే నభా 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకోవడం విశేషం.
 
నభా లేటేస్ట్ గా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. అలాగే నాగబంధం అనే పాన్ ఇండియా మూవీలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో నభా నటేష్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.