శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (12:29 IST)

మధుర మీనాక్షి ఆలయంలో బయటపడిన సొరంగం.. నిధులున్నాయట!

సుప్రసిద్ధ క్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో గతంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి గుర్తుండే వుంటుంది. అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో రహస్య సొరంగం ఒకటి బయటపడింది.


ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా.. ఈ సొరంగం బయటపడింది. పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.
 
ఈ సొంరంగం ఆలయం లోపలి నుంచి ప్రారంభమై.. ఎంతవరకూ వెళ్లిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా, ఈ సొరంగంలో భారీ నిధి దాగుందని స్థానికులు చెప్తున్నారు.

సొరంగం బయట పడటంతో తవ్వకాలను అధికారులు నిలిపేశారు. దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో పడ్డారు.