శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 4 జులై 2019 (22:16 IST)

సీఎం జగన్ లోని ఆ యాంగిల్‌ సచివాలయ సిబ్బందికి నచ్చేసిందట

ఏపీ సీఎం జగన్ వర్క్ స్టైల్ అధికార వర్గాన్ని తెగ ఇంప్రెస్ చేస్తోందట. వర్క్ విషయంలో జగన్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు సచివాలయ సిబ్బందికి ఇచ్చిన ఆఫర్‌తో వారే ఆశ్చర్యపోతున్నారు. జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
 
ఎంతసేపు ఉన్నామన్నది కాదన్నయ్యా.. పనయ్యిందా.. లేదా.. క్లుప్తంగా చెప్పాలంటే జగన్ వర్క్ స్టైల్ ఇలాగే ఉందట. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సూటిగా సుత్తి లేకుండా సమీక్షలు సాగిస్తూ అందరినీ ఆకర్షించారు జగన్. అయితే ముఖ్యమంత్రి అయిన కొత్త కాబట్టి ఇదే ఉత్సాహం ఉంటుందా అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
 
కానీ రోజురోజుకు తనదైన వర్కింగ్ స్టైల్‌తో అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. సాయంత్రం 5.30 తరువాత సెక్రటరియేట్లో ఉండాల్సిన అవసరం లేదని సిబ్బందికి చెప్పేశారట. ఉదయం టైమ్‌కు రావాలి. సాయంత్రం టైంకి వెళ్ళిపోవాలి. వర్క్ పక్కాగా చేయాలి.
 
ఇదే ఫార్ములా అట. వర్కింగ్ అవర్స్‌లో సరిగ్గా పనిచేయకుండా సాయంత్రం 7, 8 గంటల దాకా సెక్రటరియేట్లో ఉంటే బాగా పనిచేస్తున్నట్లు కాదని అధికార వర్గాలకు స్పష్టంగా చెప్పేశారట జగన్. కేవలం వర్క్ టైమింగ్ లోనే కాకుండా ప్రతి విషయంలోనే కాకుండా స్మార్ట్‌గా పనిచేయాలన్నది జగన్ ఉద్దేశమట. జగన్‌లోని ఈ యాంగిల్ బాగుందంటున్నారు సచివాలయ సిబ్బంది.