సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:31 IST)

ఉత్తరాంధ్రకు మరో మూడు రోజులు భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురసే సూచలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణులు తెలిపారు.

ఉపరితల ఆవర్తన ద్రోణి  ఉత్తర ఒడిశా, ఛత్తీస్ ఘడ, మహారాష్ట్ర లపై 1.5 కిలోమటర్ల నుంచి 7 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కారణంగా రాగల 72 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి.

అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశాలున్నాయి.

ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. చేపలు వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయి.