మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (14:44 IST)

రాష్ట్రానికి మేలు జరగాలనే కాంగ్రెస్‌తో బాబు పొత్తు పెట్టుకున్నారు... నల్లారి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి అంటూ కితాబిచ్చారు. అనంత పర్యటనలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశారని వివరించారు.
 
దివంగత సీఎం వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పరితపింతేవారని.. అది ఆయన కలంటూ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తారో.. కాంగ్రెస్‌కు మద్దతిస్తారో వైసీపీ, జనసేనలు తేల్చుకోవాలన్నారు. ఏ జట్టులో ఉండాలనుకుంటున్నాయో ఆ పార్టీలే తేల్చుకోవాలన్నారు. ఏపీలో బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలో పొత్తుతో ఒక్కటైన సంగతి తెలిసిందే.