శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (11:32 IST)

తప్పులే తప్పులు.. ఓ వ్యక్తి వయస్సు.. 350 సంవత్సరాలట.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా ఇటీవల విడుదలైంది. ఈ ఓటర్ల జాబితాలో 15 శాతం ఓటర్ల వివరాలు తప్పులేనని తేలింది. ముఖ్యంగా ఓ ఓటర్ కార్డులో వ్యక్తి వయస్సును 350గా ఎన్నికల సంఘం నమోదు చేయడం ప్రస్తుతం అందరికీ షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో ఓ వ్యక్తి వయస్సు 350గా పేర్కొనబడటంపై నెట్టింట రచ్చ జరిగింది.
 
దీన్ని గమనించిన ఈసీ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. సదరు ఓటర్ కార్డులోని వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు కాగా.. 350గా పడిందని.. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అంటూ ఈసీ తెలిపింది. ఏపీలో 3.6 కోట్ల ఓటర్లున్న నేపథ్యంలో.. ప్రస్తుతం విడుదలైన ఓటర్ల జాబితాలో 52.67 లక్షల ఓటర్ల వివరాలు తప్పుల తడకగా వున్నాయి. ప్రస్తుతం వీటిని సరిదిద్దే, సవరించే పనుల్లో అధికారులున్నారు.
 
అయితే 350 ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి ప్రాణాలతో వున్నాడా... ఇదేదో గిన్నిస్ రికార్డులో నమోదు కావాల్సింది.. అని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. విజయవాడకు చెందిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి ఓటర్ ఐడీ కార్డులో.. అతని వయస్సును 350గా ఈసీ ప్రింట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.