గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (11:42 IST)

విష సర్పంతో సెల్ఫీ.. పామును మెడలో వేసుకుని ఫోజిచ్చాడు.. అంతే కాటేసింది..

స్మార్ట్‌ఫోన్ లేనిదే పొద్దు గడపని వారి సంఖ్య పెరిగిపోతుంది. 20వ శతాబ్ధంలో అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. స్మార్ట్‌ఫోన్లు చేతిలో పెట్టుకుని సెల్ఫీల పిచ్చిలో చాలామంది యువత ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీల కోసం యువత సాహసాలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ కోసం పాకులాడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
సూలూరు పేటకు చెందిన జగదీష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి.. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం సూళూరుపేట గ్రామం లో ఓ పాములోడు విష సర్పాలతో రోడ్డుపై ఆడిస్తుండగా.. జగదీష్ పాములతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబాకాడు. అంతేగాకుండా పామును మెడలో వేసుకున్నాడు. కానీ ఆ సర్పం జగదీష్‌ను కాటేసింది. 
 
వెంటనే స్థానికులు జగదీష్‌ను ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. పాము విషం శరీరంలోకి వేగంగా పాకడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు పాము పళ్లు పీకకుండా రోడ్డుపైకి పాములను తెచ్చిన పాములడు కోసం గాలిస్తున్నారు.