1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heavy ganja seizure .. Do you know somewhere?

భారీగా గంజాయి స్వాధీనం.. ఎక్కడో తెలుసా?

ganja
విజయనగరం జిల్లాలోని పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

బుధవారం కొమరాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ కు అక్రమంగా లారీలో తరలిపోతున్న గంజాయిని గుర్తించామన్నారు.

కొమరాడ రహదారి వద్ద గోతుల కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో ఓ లారీలో గంజాయిని గుర్తించామని చెప్పారు. పార్వతీపురం వైపు నుంచి రాయగడ రోడ్డు మీదుగా అక్రమంగా లారీలో తరలిస్తున్న సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌