బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:55 IST)

బిల్‌గేట్స్‌ కు పితృ వియోగం

మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కు పితృ వియోగం సంభవించింది. ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి విలియమ్‌ హెన్రీ గేట్స్‌ (94) మృతి చెందారు.

హెన్రీగేట్స్‌ 1925 నవంబర్‌ 30న వాషింగ్టన్‌లో జన్మించారు. 'ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో అద్భుతమైన వ్యక్తిని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను' అని బిల్‌గ్రేట్‌ తన బ్లాగ్‌లో రాశారు.

ఆయన ఆల్జెమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 'నా తండ్రే నా జీవితంలో నిజమైన బిల్‌ గేట్స్‌. ఆయనలా ఉండేందుకు ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నాను. ఆయనను చాలా మిస్‌ అవుతున్నాను' అని ట్వీట్‌ చేశారు బిల్‌ గేట్స్.