గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (07:54 IST)

ప్రముఖ జానపదకళాకారుడు వంగపండు మృతి

ప్రపంచం మెచ్చిన జానపదకళాకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. తను మలచిన పాటను మనకు వదలి పరలోకానికి పయనమైపోయారు.

ఈ ప్రముఖ వాగ్గేయకారుడు కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయన 1972 జననాట్య మండలిని స్థాపించి, జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను చైతన్యపరిచారు.

తన జీవిత కాలంలో వందలాది జానపదాలకు వంగపండు గజ్జెకట్టారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. కళాకారులు కుల మతాలు, ప్రాంతీయ భేదాలు ఉండవు అనడానికి సరైన తార్కాణం ప్రజాకవి వంగపండు అనడంలో అతి సయోక్తి లేదు.

ఉత్తరాంధ్రలో పుట్టి ఉత్తరాంధ్రలో పెరిగి తెలంగాణ ప్రాంతంలోరణం, మునసబు, పెత్తందారీల ఆగడాలపై ఆయన స్వయంగా రచించి ప్రదర్శించిన భూభాగోతం ఇందుకు తార్కాణం. వంగపండు మరణంపై ప్రజాగాయకుడు గద్దర్‌ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు అని పేర్కొన్నారు.