శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (09:54 IST)

విజయవాడలో రౌడీలపై పోలీసులు దృష్టి!

విజయవాడలో ఇటీవ‌ల జరిగిన గ్యాంగ్ వార్ ఒక్కసారిగా నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోని విచారించారు.

గొడవతో సంబంధం ఉన్నవాళ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదే క్ర‌మంలో న‌గ‌రంలోని మొత్తం రౌడీషీటర్ల ఏరివేతపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. 400 మందికి పైగా రౌడీషీటర్లను బెజవాడ నగరంలో గుర్తించ‌డంతో పాటు వారిలో 70 మంది ప్రస్తుతం త‌మ కార్య‌క‌లాపాలు య‌ధావిధిగా కొన‌సాగిస్తున్న‌ట్లు నిర్దారించారు.

రాత్రి పూట వారి కదలికలపై నిఘా పెట్టి అతిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న నలుగురిని నగర బహిష్కరణ చేశారు. మరికొందరిని కూడా నగర బహిష్కరణ కోసం లిస్ట్ ఔట్ చేశామని నగర పోలీస్ క‌మిషన‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు.

రౌడీషీటర్లు ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ సేవించడంతో పాటు విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా పో‌లీసులు గుర్తించారు. చాలామంది విద్యార్థులు మ‌త్తు ప‌దార్థాల‌కు బానిసల‌వుతున్నారని ఈ క్ర‌మంలో తల్లిదండ్రులు మ‌రింత అప్రమత్తంగా ఉండాలి సీపీ సూచించారు.