బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (17:06 IST)

వారంరోజుల్లో విజయవాడ రోడ్లు మరమ్మత్తులు: ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కేశినేని శ్వేత

విజయవాడ 11వ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూజిడి పనులు పూర్తి అయ్యిన యాదవుల బజార్, దానయ్యబజార్, భాగయ్యబజార్, కరణంగారి బజార్ లలో శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత పర్యటించి రోడ్లు పరిశీలించారు.

వారంరోజుల్లో రోడ్లు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానికులకు తెలియజేసారు. గడిచిన టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, దాని వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేక పోతున్నారని అన్నారు.

ఈ రహదారుల విషయంలో సమస్య పరిష్కారించే విధంగా సంబంధిత మునిసిపల్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, రోడ్లు మరమ్మతులకు వారం రోజులలో పనులు ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వారు చెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, విజృంభిస్తున్న కరోనాపై మరింత జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు డివిజన్ లో పర్యటిస్తున్నామని అన్నారు.