శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జులై 2020 (12:04 IST)

విజ‌య‌వాడ‌లో రెండు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు.. భారీగా న‌గ‌దు, న‌గ‌లు స్వాధీనం

విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలో ఇటీవల జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. జూన్ 1న  విజయవాడ వన్‌టౌన్‌లోని బంగారం షాపు యజమాని ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రూ.56.65 లక్షల విలువైన 1225 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు మహారాష్ట్రకు చెందిన ఆమోల్ వసంత్ పటేల్, శైలేష్ పాటిల్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ఇరువురూ ఫిర్యాదిదారుడికి చెందిన బంగారం దుకాణంలో పనిచేస్తుండేవారు. అలాగే ఉయ్యూరు పట్టణంలో జరిగిన చోరీ కేసులో నిందితుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ కాబడిన రూ.77.50 లక్షలకు గాను రూ.33.84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యం గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడ‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు త‌మ ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా రెండు కేసుల్లో నిందితులను పట్టుకుని, చోరీ కాబడిన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో సమర్ధంగా వ్యవహరించిన వన్‌టౌన్ సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్సై బి.శంకరరావు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ ఎస్వీవీఎస్ మూర్తి తదితరుల‌ను సీపీ శ్రీనివాసులు అభినందించారు.