బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (20:06 IST)

విజయవాడ మీదుగా వెళ్లే వాహనాల మళ్లింపు (video)

విజయవాడ మీదుగా వెళ్లే వాహనాల మార్గాలను మళ్లించారు. నెలరోజుల పాటు ఈ మళ్లింపు వుంటుందని పోలీసులు తెలిపారు. ఆ వివరాలు...
 
1. హనుమాన్ జంక్షన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తులు కారణంగా నూజివీడు, తిరువూరు ఖమ్మం జిల్లా వైపు వెళ్ళు వాహనాలు హనుమాన్ జంక్షన్ నుండి డైవర్షన్ చేయడం జరిగినది. కావున పోలీసు వారి యొక్క సూచనాలు మరియు ట్రాఫిక్  డైవర్షన్ లను వాహనదారులు పాటించవలెను.
 
2. ఏలూరు, గుడివాడ వైపు నుంచి వచ్చే తిరువూరు ఖమ్మం జిల్లాలకు వెళ్లవలసిన వాహనదారులు విజయవాడ- ఇబ్రహ్మిపట్నం మీదుగా వెళ్లవలెను.
 
3. నూజివీడు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళు వాహనదారులు హనుమాన్ జంక్షన్ మూలకొట్టు సెంటర్ వద్ద నుంచి వేలేరు రైల్వే బ్రిడ్జి - సీతారాంపురం మీదుగా నూజివీడు వెళ్ళుటకు రాకపోకలు చేయుటకు అనుమతి కలదు.
 
4. హనుమాన్ జంక్షన్ , వేలేరు, సీతారాంపురం నూజివీడు రోడ్ లో భారీ వాహనాలకు అనుమతి లేదు.
 
5. ఖమ్మం వైపు నుండి తిరువూరు మీదుగా హనుమాన్ జంక్షన్ వైపు రావలసిన వాహనాలు లక్ష్మిపురం(తిరువూరు)-మైలవరం-ఇబ్రహీంపట్నం-విజయవాడ- హనుమాన్ జంక్షన్ మీదగా మరలిచడం అయినది.
 
6. అదేవిదంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా ఖమ్మం జిల్లాకు వెళ్ళు వాహనాలు పశ్చిమ గోదావరి దేవరపల్లి మరియు ఏలూరు నుండి చింతలపూడి మీదుగా సత్తుపల్లి వైపు వెళ్లవలసినదిగా కొరడమైనది.
 
7. అదేవిదంగా ఖమ్మం జిల్లా నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా పశ్చిమ గోదావరి వెళ్ళు వాహనాలు, ఖమ్మం జిల్లా తల్లాడ- అశ్వరావుపేట-దేవరపల్లి మీదుగా వెళ్లవలెను.
 
8.   కావున పైన తెలిపిన ట్రాఫిక్ డైవర్షన్  యొక్క సూచనాలు ఒక నెలపాటు ఖచ్చితముగా పాటించవలసినదిగా పోలీసు వారి గమనిక.