విజయవాడ ఐసోలేషన్ వార్డ్ లో 'మైత్రీ'

robo
ఎం| Last Updated: ఆదివారం, 24 మే 2020 (23:28 IST)
సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్, హర్షా అకాడమీ వారి సం యుక్త
ఆధ్వర్యంలో రూపొందించబడిన ''మైత్రీ'' అనబడే రోబోను ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్
ఆవిష్కరించారు.


ఈ రోబోను హైదరాబాద్ కు చెందిన 'సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ ' చైర్మన్
ఫణికుమార్
ఆధ్వర్యంలో ఆ సంస్థ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ రూపొందించారు. ఈ రోబోను ముఖ్యంగా ఐసోలేషన్ వార్డ్ లో చికిత్సపొందుతున్న కరోనా భాధితుల సహాయార్థం రూపొందించటం జరిగినట్లుగా దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.

మైత్రీ రోబోను ఆదివారం హార్ష అకాడమీ డైరెక్టర్

తనూజ్ కుమార్
కలెక్టర్ ఇంతియాజ్ కు అందచేసారు.ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసేవలకు
ఎంతగానో ఉపయోగపడే రోబోను తయారుచేసి అందచేసినందుకు సర్క్యూట్ గ్రిడ్
ను, హర్షా అకాడమీ వారిని కలెక్టర్ అభినందించారు.

జిల్లాలో వీటిని వినియోగిo చుకునేందు రెండు రోబోలను ఉచితంగా అందించిన హర్ష అకాడమీ, సర్క్యూట్ గ్రిడ్ వారిని కలెక్టర్ అభినందించారు.

ఈ సంధర్భంగా రోబో పనితీరును
సర్క్యూట్ గ్రిడ్ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ వివరిస్తూ ఈ మైత్రీ రోబో వైఫై టెక్నాలజీతో పనిచేస్తుందనీ, దీనిని 20 అడుగుల దూరం నుండి
మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కరోనా రోగులకు ఆహారం ,మందులు అందించవచ్చని, తద్వారా వైద్యసిబ్బంది కరోనా వైరస్ బారినపడకుండా కాపాడవచ్చని
తెలిపారు.

తమసంస్థ సర్క్యూట్ గ్రిడ్ రోబోల తయారీనే కాకుండా హోం ఆటోమేషన్ ఇండస్ట్రీలో కూడా సేవలు అందిస్తుందని తెలిపారు.దీనిపై మరింత చదవండి :