ఈ 25 నుంచి విజయవాడ తితిదే కల్యాణమండపంలో శ్రీవారి లడ్డూ విక్రయాలు
తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి విజయవాడలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో విక్రయించనున్నట్లు తితిదే సూపరింటెండెంట్ ఎస్.శోభారాణి తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ అమలు నేపధ్యంలో ఇప్పటివరకూ స్వామివారి ఆలయాన్ని మూసివేయడంతో పాటు ప్రతి నెలా రెండో శనివారం విక్రయించే లడ్డూ ప్రసాదం విక్రయాలను కూడా నిలిపివేసిన విషయం విధితమె.
ఈ క్రమంలో తితిదే బోర్డ్ ఆదేశాల మేరకు ఈ నెల 25న (సోమవారం) నుంచి ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి లడ్డూ విక్రయాలు జరుపుతామన్నారు.
ఇప్పటి వరకూ రూ.50కి విక్రయించిన చిన్న లడ్డూ ధర రూ.25లు తగ్గించిన నేఫధ్యంలో ఒక్కో లడ్డూను రూ.25కు విక్రయిస్తామని పేర్కొన్నారు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శోభారాణి కోరారు.