కృష్ణా జిల్లాలో నాటు సారా, అక్రమ మద్యం కట్టడి
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారు జాము నుండి విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 తండాలలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
కృష్ణాజిల్లాలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నాటుసారా తయారీని నిర్మూలించి, తయారీదారుల పై కేసులు నమోదు చేసి నాటుసారా నిర్మూలన దిశగా పోలీసు యంత్రాంగం పనిచేయాలని, అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యాన్ని కట్టడి చేయాలని ఎస్పీ పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి వకుల్ జిందాల్ నేతృత్వంలో నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో, 150 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తాత కుంట్ల తండా, బాణావతు తండా, చిన్న తండా, పెద్దతండ వేమి రెడ్డి పల్లి తండా, గ్రామాలలో పోలీసు సిబ్బంది తెల్లవారుజాము నుంచి జల్లెడ పట్టి నాటుసారా నిల్వలను పసిగట్టారు.
ఈ దాడులలో 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 3500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. 70 కేజీల బెల్లం 20 మంది వ్యక్తులను గుర్తించి, వారిపై కేసుల నమోదు చేశారు.
ఈ కార్డును సర్చ్ ఆపరేషన్లో మైలవరం సిఐ శ్రీను, హనుమాన్ జంక్షన్ సిఐ రమణ, నూజివీడు సిఐ రామచంద్ర రావు, ఎక్సైజ్ సూపరిండెంట్ మనోహర్, ఎక్సైజ్ సిఐ లు నూజివీడు సాయి కుమార్ విస్సన్నపేట బాలాజీ తిరువూరు శ్రీహరి మైలవరం రాజు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.