ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 మే 2020 (21:29 IST)

మచిలీపట్నంలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం

తెలంగాణా రాష్ట్రం నుండి చందర్లపాడు మండలం లక్మీ పురం గ్రామానికి అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు ద్వీచక్ర వాహనాలు, అదేవిధంగా 60 మద్యం బాటిల్స్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 

ముఖ్యమంత్రి  ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోరాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం లో భాగంగా  రాష్ట్రంలో అక్రమ మద్యం, అక్రమ ఇసుక  రవాణా అరికట్టాలని లక్ష్యంతో వాటి నియంత్రణకు ముఖ్యమంత్రి  అధ్యక్షతన "స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో" ఏర్పాటు చేశారు.
 
అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను, అక్రమ మద్యాన్ని నిరోధించేలా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తు, జల్లెడ పడుతున్న జిల్లా పోలీసు యంత్రాంగం గడిచిన మూడు రోజులుగా 61 చెక్ పోస్టుల వద్ద నమోదు చేసింది.

పట్టుకున్న మద్యం ఇతర రాష్ట్రాలు , జిల్లాల నుండి  జిల్లాలోకి అక్రమ మద్యం  తరలిస్తున్న వారిని గుర్తించి  మొత్తం 94 కేసులు నమోదు చేసి, 132 మందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 8 లక్షల విలువైన 2144 మద్యం బాటిళ్లను, 38 ద్విచక్ర వాహనాలు, 2 ఫోర్ వీలర్ వెహికల్స్ స్వాధీనం చేసుకొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టే దిశలో భాగంగా గడచిన 10 రోజుల వ్యవధిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న  వారిపై 16 కేసులు నమోదు చేసి 24 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద నుండి 15 ట్రాక్టర్లు,5 ఎద్దుల బండ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యపాన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అందులో భాగంగా ఇసుక, అక్రమ మద్యం నివారణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిందన్నారు. పోలీస్ ఆదేశాలు మీరి ఎవరైనా అక్రమ మద్యాన్ని తరలించాలని చూసిన, తరలించడానికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా దాడులు తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయి అన్నారు.