బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (22:37 IST)

రేపు విజయవాడ హైవేలో ట్రాఫిక్ మళ్లింపు... గమనించగలరు

రేపు జూలై 1 ఉదయం 9 గంటలకు విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిచే 104 మరియు 108 నూతన వాహనముల ప్రారంభించబడును. కావున ఈ క్రింద సూచించిన విధముగా ట్రాఫిక్ మళ్లింపులు చేయడమైనది. భారీ వాహనములు మరియు లారీలు(సరకు రవాణావాహనములు) ఈ క్రింది విధముగా మళ్లింపులు:
 
1. చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా ఏలూరు విశాఖపట్నంకు వెళ్ళే వాహనాలను 30.06.2020 రాత్రి 12.00 గంటల నుండి ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి బాపట్ల- అవనిగడ్డ- చల్లపల్లి- పామర్రు- గుడివాడ- హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వైపుకు.
 
2. జూలై 1,2020 ఉదయం 4 గంటలనుండి గుంటూరు నుండి విజయవాడ నగరంలోకి లారీలు/భారీ వాహనములు అనుమతించబడవు.
 
3. విశాఖపట్నం నుండి విజయవాడ మీదుగా చెన్నై వెళ్ళు భారీ వాహనములు 1.7.2020 ఉదయం 4 గంటల నుండి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ- పామర్రు- చల్లపల్లి- అవనిగడ్డ మీదుగా పంపబడును.
 
విజయవాడ నగరంలో ఈ క్రింది విధముగా మళ్లింపులు:
1. ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి విజయవాడ నగరంలో బెంజ్ సర్కిలు నుండి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు రెండు వైపులా ఏవిధమైన వాహనములు అనుమతించబడవు.
 
2. గుంటూరు వైపు నుండి విజయవాడ మరియు ఏలూరు వెళ్ళు వాహనములు అనగా కార్లు మోటార్ సైకిళ్ళు వారధి- పాత కృష్ణలంక పోలీసు స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి విజయవాడ నగరంలోకి అనుమతించబడును.
 
3. ఏలూరు వైపు నుండి గుంటూరు వైపుకు వెళ్ళు వాహనములు అనగా కార్లు, మోటార్ సైకిళ్ళు రమేశ్ హాస్పిటల్ వరకు వచ్చి గురునానాక్ నగర్ రోడ్డు- ఫన్ టైమ్ క్లబ్ రోడ్డు- పంటకాలువ రోడ్డు- యన్టీఆర్ సర్కిలు- కృష్ణవేణి రోడ్డు- గుల్జార్ బ్రిడ్జ్- రామలింగేశ్వర్ నగర్- స్క్రూ బ్రిడ్జ్- వారధి మీదుగా వెళ్లవలయును.
 
4. మచిలీపట్నం వైపు నుండి గుంటూర్ వెళ్ళు వాహనములు అనగా కార్లు, మోటార్ సైకిళ్ళు బందరు రోడ్డులో యన్టీఆర్ సర్కిలు కృష్ణవేణి రోడ్డు- గుల్జార్ బ్రిడ్జ్- రామలింగేశ్వర్ నగర్- స్క్రూ బ్రిడ్జ్- వారధి మీదుగా వెళ్లవలయును.
 
5. మచిలీపట్నం వైపు నుండి విజయవాడ నగరంలోకి వచ్చు వాహనములు ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుండి- పంటకాలువ- ఏపి ‌ఐ‌ఐసి కాలనీ రోడ్డు- గురునానక్ నగర్ రోడ్డు- రమేశ్ హాస్పిటల్ నుండి విజయవాడ నగరంలోకి అనుమతించబడును.
 
ఆర్.టి.సి.బస్సులు మళ్లింపు మార్గములు:
1. ఏలూరు వైపు నుండి విజయవాడ వచ్చు ఆర్.టి.సి. బస్సులు రామవరప్పాడు రింగ్ నుండి- ఏలూరు రోడ్డు- గుణదల- చుట్టుగుంట- దీప్తి జంక్షన్- అప్సరా జంక్షన్- ఆర్.టి.సి. వై జంక్షన్- పోలీసు కంట్రోల్ రూమ్ నుండి పి‌ఎన్‌బి‌ఎస్‌కు వెళ్లవలయును. అదేవిధముగా విజయవాడ నుండి ఏలూరు వెళ్ళవలయును.
 
2. మచిలీపట్నం వైపు నుండి విజయవాడ వచ్చు ఆర్.టి.సి. బస్సులు తాడిగడప- ఆటోనగర్ 100 అడుగులు రోడ్డు- మహానాడు రోడ్డు- రామవరప్పాడు రింగ్ నుండి- ఏలూరు రోడ్డు- గుణదల- చుట్టుగుంట- దీప్తి జంక్షన్- అప్సరా జంక్షన్- ఆర్.టి.సి. వై జంక్షన్- పోలీసు కంట్రోల్ రూమ్ నుండి పి‌ఎన్‌బి‌ఎస్‌కు వెళ్లవలయును. అదేవిధముగా విజయవాడ నుండి  మచిలీపట్నం వెళ్ళవలయును.
 
ప్రజాపతినిధులు మరియు ముఖ్యఅతిథులు బెంజ్ సర్కిలుకు చేరుకోవలసిన మార్గములు:
బందర్ రోడ్డు మినహా జాతీయ రహదారి, పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, రూట్ నెంబర్-5, ఏలూరు రోడ్డు, మచిలీపట్నం రోడ్డు మీదుగా బెంజ్ సర్కిలు చేరుకోవలయును, కావున వాహనదారులు ట్రాఫిక్ వాహన మళ్లింపు మార్గములు గమనించి సహకరించాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది.