మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (21:15 IST)

టీడీపీ అధికారంలోకి రాగానే రెండు సెంట్లు ఇచ్చేస్తా: దేవినేని ఉమ

ఊరికి దూరంగా నివాసయోగ్యంకానీ ఆ గుట్టల్లో స్థలాలు లబ్ధిదారులు మాకొద్ధంటున్నా..  అక్కడే ఉండాలంటూ వైసీపీ నేతలపట్టుపడుతున్నారని, స్థలాలు ఇచ్చేది పేదలకా? మీ పార్టీ నేతల దోపిడి కోసమా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

మంగళవారం సాయంత్రం మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. చండ్రగూడెంలో ఇదే పరిస్థితి నెలకొన్నదని వైసీపీ నేతలు అధికారులను అడ్డంపెట్టుకొని 40 సం. లుగా సాగుచేసుకుంటున్న దళితరైతుల భూములు లాక్కుంటుంటే ఆ రైతుల ఆర్తనాదాలు తాడేపల్లి రాజప్రసాదానికి వినబడడం లేదా..? అని ప్రశ్నించారు.

పోలవరం పట్టిసీమ పై కారుకూతలు కూసారని, జల శక్తి నివేదికతో నోళ్లు ఎల్లబెట్టారని ఎద్దేవా చేశారు. పంచాయతీ రంగులపై పదేపదే కోర్టు మెట్లు ఎక్కారని, రంగు పడగానే ముఖాలు మాడ్చారన్నారు.

అమరావతి రైతులను దగా చేశారని, వైన్స్ లో దోచారరు.. మైన్స్ లో దోచారు...ఇళ్ల స్థలాల్లోనూ దోచారని ఆరోపించారు. 'సెంటుభూమి' పథకం కోసం మైలవరం మండలం ఎదురుబీడెంలో పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యే మైలవరం లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఎందుకు తగ్గించారు..? అని ప్రశ్నించారు.  తెలుగుదేశం అధికారంలోకి రాగానే మైలవరం నియోజకవర్గంలో రెండు సెంట్లు ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. అన్ని లెక్కలకు వడ్డీలు కడతామని అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలు చెప్తామని తెలిపారు.

జూలై 4వ తేదీ నాటికి అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు అవుతుందని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని  ఉద్యమాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని,  అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ ఇంటింటా అమరావతి ఉద్యమం చేయాలని సూచించారు.