మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (20:31 IST)

లుడో గేమ్ ప్రాణాలు తీసింది.. ఎలాగో తెలుసా?

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్‌తో చాలామంది ఆన్ లైన్ గేమ్‌లు ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. అలా లుడో గేమ్ ఆడిన పాపం ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. సరదాగా ఆడిన ఆట.. ప్రాణాల మీదకు వచ్చింది. తనపై లూడో ఆడి గెలిచాడని ఓ వ్యక్తి తన మిత్రుడినే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లో సోమవారం రాత్రి వట్టికొండ నాగేశ్వరావు, కోలా గోపి అనే మిత్రులు లూడో గేమ్ మొదలు పెట్టారు. మద్యం తాగుతూ బెట్టింగ్ పెట్టుకున్నారు. అలా రెండు గేమ్‌లు ఆడగా రెండింటిలోనూ నాగేశ్వరరావు గెలిచాడు. దీంతో గోపి అసహనానికి గురయ్యాడు. ఈసారి పెద్దమొత్తంతో బెట్టిబగ్ పెట్టి ఆడదామంటూ సవాల్ విసిరాడు. 
 
అయితే నాగేశ్వర్ రావు గోపిని అవహేళన చేశాడు. దాంతో కోపంతో రగిలిపోయిన గోపి మద్యం సీసాను పగలగొట్టి వెంకటేశ్వర్ రావు మెడపై, పొత్తి కడుపులో పొడిచాడు. దాంతో వెంకటేశ్వర్ రావు అక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.