శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (10:00 IST)

వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచారం... దంపతులే ఆ పని చేస్తున్నారు..

వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులో జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో ఈ ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవని వెల్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వెల్ నెస్ సెంటర్ పేరుతో లోకాంటో వెబ్ సైట్‌లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు. 
 
శైలజ తన మొబైల్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో పెట్టి ఫోన్ చేసిన వారికి వివరాలు తెలుపుతోంది. తనకు సాయంగా గద్వాలకు చెందిన చందా వనజశ్రీని నియమించుకుంది. ఆమె ద్వారా కూడా విటులను ఆకర్షిస్తోంది. ఆమెకు నెలకు రూ.10,000 ఇస్తోంది. మరోవైపు బ్రోకర్ల సాయంతో వీరు ఉత్తరాది రాష్ట్రాలనుంచి మహిళలను తీసుకువచ్చి వారితో వెల్ నెస్ సెంటర్‌లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనికి భర్త పరమేశ్వరన్ కూడా సహకరిస్తున్నాడు. గతకొంత కాలంగా జరుగుతున్న ఈ హైటెక్ దందాపై పోలీసులకు సమాచారం అందింది.
 
గురువారం వెల్ నెస్ సెంటర్ పై దాడి చేసి నిర్వాహకురాలు శైలజతో సహా నలుగురు మహిళలను, ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకున్న భర్త పరమేశ్వరన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.