శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (08:44 IST)

ఖాకీ కాదు కామాంధుడు.. చెల్లి కుమార్తెపై అత్యాచారం..

హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కామాంధుడిగా మారిపోయాడు. 33 యేళ్ళ ఈ ఖాకీ కామాంధుడు ఏకంగా 12 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, సిఖ్‌విలేజ్‌కు చెందిన వరదరాజ్ సుదేశ్ ఉమేశ్ (33) అక్కడి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 
 
అతడి సోదరి కూడా సమీపంలోనే నివసిస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమేశ్‌కు తన కుమార్తెతో భోజనం పంపించింది. ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉమేశ్.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది.
 
ఈ ఘటన తర్వాత ఉమేశ్ ఇంటికి వెళ్లమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా వెళ్లేందుకు బాలిక నిరాకరించేది. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్తె చెప్పింది విని విస్తుపోయిన తల్లిదండ్రులు గురువారం బాలల హక్కుల సంఘంతోపాటు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.