దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌లుగా వేశ్యవాటికలు?
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అదేసమయంలో దేశంలోని వేశ్యవాటికలు అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌లుగా అవతరిస్తాయని ఓ అధ్యయన హెచ్చరించింది. ఈ వేళ్యవాటికలను అలాగే తెరిచివుంచితే కొవిడ్ విజృంభణ తారాస్థాయికి చేరుతుందనీ, 4 లక్షల మందికి పైగా వైరస్ సోకుతుందనీ, వారంతా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే క్రమంలో 12 వేల మంది మృత్యువాత పడే అవకాశముందని ఆ అధ్యయనం తెలిపింది.
ఈ అధ్యయనం జరిపింది... యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, హా ర్వర్డ్ మెడికల్ స్కూల్ విద్యావేత్తలు. వైశ్యావాటికలను మరికొంత కాలం మూసేయడం ద్వారా కొవిడ్ మరణాలను 60 శాతం తగ్గించొచ్చని ఓ నమూనాను విద్యావేత్తలు అభివృద్ధి చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వేశ్యావాటికను మరికొంత కాలం మూసేయడం ద్వారా కరోనా విజృంభణ, మరణాలను 25 వేలకు తగ్గించొచ్చని అంచనా వేసింది.
సెక్స్ వర్కర్ల ద్వారా కొవిడ్ ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనకర్తలు తెలిపారు. సంభోగం సమయంలో వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా కొవిడ్ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యక్తి పలు ప్రాంతాల్లో ఇతరులను కలవడం, మాట్లాడటం, ఇలా అనేక సంఘటనలతో వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు తమ అధ్యయనంలో తేల్చారు.