సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (17:34 IST)

పాకిస్థాన్‌‌లో కరోనా.. ఒకే రోజు 148మంది మృతి.. 192000 మార్క్ దాటిన కేసులు

పాకిస్థాన్‌‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,044 మందికి కరోనా సోకినట్లైంది. తద్వారా పాకిస్థాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1,92,970కి పెరిగింది.

ఇంకా గడిచిన 24 గంటల్లో 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా 3,903గా మృతుల సంఖ్య నమోదైంది. అలాగే కరోనా సోకి చికిత్స పొందుతూ ఇప్పటివరకు 81,307 మంది డిశ్చార్జ్ అ్యయారు. 
 
మొత్తంగా సింధులో 74,070, పంజాబ్ 71,191, కైబర్ -23,887, ఇస్లామాబాద్ -11,710, బలూచిస్థాన్‌లో 9,817, గిల్గిత్‌లో 1,365, అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 930మందికి కరోనా సోకింది.