శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జులై 2020 (10:07 IST)

నేటి నుంచి విజ‌య‌వాడ‌లో దుకాణాలు బంద్

రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో నేటి నుంచి విజయవాడలో పలు మార్కెట్ లు, దుకాణాలు బంద్ కానున్నాయి. విజ‌య‌వాడ‌ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను ఆరు రోజులు మూసివేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్‌ను బంద్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి.

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి. ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం ఇత‌ర మార్కెట్ల‌పై సైతం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి లాక్‌డౌన్‌లు విధించారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులే స్వ‌చ్చందంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.