శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (11:07 IST)

పీవీపీ ఎక్కడ?.. తెలంగాణ పోలీసుల గాలింపు

వైసీపీ నేత పీవీపీ కోసం తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆయన విజయవాడలో వున్నట్లు తెలిసి జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడకు చేరుకున్నారు.

పీవీపీ ఇల్లు, ఆయన స్నేహితులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో వెతుకుతున్నారు. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు.

విల్లా యజమానితో వివాదంతో పాటు విచారణకు వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పిన అంశంలో పీవీపీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.