ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:35 IST)

తెలంగాణ పోలీసులకు గుడ్‌న్యూస్

తెలంగాణ పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వైద్యులు, పొలీసులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. 

పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. హోం గార్డు నుంచి డీజీపీ వరకూ అందరి హెల్త్ ప్రొఫైల్.
లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వైద్యులు, పొలీసులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం.

హోం గార్డు నుంచి డీజీపీ వరకూ అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిధుల కేటాయింపులు ఉండేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.

దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆర్జీలు పెట్టుకోవాలని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మొత్తం వివరాలను పోలీస్ పథకం ఆరోగ్య భద్రతకు లింక్ చేయనున్నారు.

కాగా ఇప్పటికే ఆరోగ్య భద్రతను టీఎస్ కాప్‌తో అనుసంధానం చేశారు. దీంతో పోలీసుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఉన్నతాధికారులకు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే 25 వేల మంది సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించింది ప్రభుత్వం. ఈ నెల 3 వరకూ అందరి ఆరోగ్య వివరాలు సేకరించనున్నారు. వీటి ఆధారంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడంతోపాటు ప్రత్యేక చర్యలు తీసుకోన్నారు.