మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:44 IST)

గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త!

కోవిడ్ -19పై జరుగుతున్న పోరాటంలో గ్రామీణ, పట్టణస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న  గ్రామ, వార్డు వాలంటీర్లకు కూడా ప్రధామంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సర్కులర్ ను జారీ చేసింది. రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు.

వీరంతా మూడు విడతలుగా కోవిడ్ -19 ఇంటింటి సర్వేలో భాగస్వాములయ్యారు. ఈ సర్వేలో భాగంగా కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లతో వీరు కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నందువల్ల గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమాను పొందవచ్చు.