మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:40 IST)

వాలంటీర్ల పరిధి పెంపు?

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల పరిధిని పెంచనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీరును నియమించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సెక్రటేరియట్ల వారీగా ఏర్పాటు చేసిన ఈ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం పరిధిని పెంచాలని నిర్ణయించారు.
 
పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల పరిధిని 50 ఇళ్ల నుండి 100 ఇళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల నుండి 75 ఇళ్లకు వాలంటీర్ల పరిధిని విస్తృతం చేయనున్నారు. ప్రసుత్తం ఇంటింటి సర్వే, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ఆయా పథకాలను ఇళ్లకు చేరవేయడం వంటి పనులన్నీ వాలంటీర్లు చేస్తున్నారు.
 
 తొలుత ఆసక్తితో చేరినా ప్రస్తుతం వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ క్రమంలో ఉన్న వాలంటీర్ల సంఖ్యను బట్టి వారి పరిధిని పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.