శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (15:00 IST)

సిగ్గు ఉండాలి.. పసుపు కుంకుమతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు-అనిల్

ఎన్నికల ముందు పసుపు కుంకుమతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. దోచుకున్నది గాక ఇప్పుడు సిగ్గులేకుండా టీడీపీ సభ్యులు మాట్లాడటంపై మంత్రి అనిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకోవడం తప్ప.. చంద్రబాబు చేసిందేమీలేదని మంత్రి అనిల్ తెలిపారు.
 
2024 ఎన్నికలకు ఏ పార్టీతో టీడీపీ పొత్తుకు పోతోంది.? ఒంటరిగా వెళ్తామని చెప్పే ధైర్యముందా? అధికారంలో ఉన్న పార్టీ చంకన ఎక్కాలని టీడీపీ చూస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తు లేకుండా వెళ్తుందా అచ్చెన్నాయుడు
శ్రీ వైయస్‌ జగన్‌ సారధ్యంలో వైయస్ఆర్‌సీపీ మాత్రం ఒంటరిగా వెళ్తుందని మంత్రి అనిల్ ఓపెన్ ఛాలెంజ్‌ చేశారు. 
 
సభ ప్రారంభమైన తర్వాత ఎస్సీ ప్రత్యేక కమిషన్‌ బిల్లుకు టీడీపీ అడ్డుపడుతున్న సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కల్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఫైర్‌ అయ్యారు. 
టీడీపీ సభ్యుడు రామానాయుడు కాస్త "డ్రామా నాయుడు" అయ్యారని అనిల్‌ మండిపడ్డారు. సిగ్గు ఉండాలి.. సిగ్గు ఉండాలి మీకు అంటూ టీడీపీ సభ్యులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ‘పసుపు- కుంకుమ’ 
పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష సభ్యులపై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ రాష్ట్ర ఖజానా నాకేసి ఏ శాఖను చూసినా ఖాళీ చేశారని.. కాపు కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్ ఇలా దేన్ని చూసినా ఎన్నికల స్టంట్‌ కోసం మొత్తం రాష్ట్ర ఖజానాను నాకేసిన వీరు మాట్లాడటమా అని అనిల్‌ మండిపడ్డారు. 
 
ఎస్సీ, ఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతుంటే ఇక్కడకు వచ్చి రచ్చ చేసి చర్చను ఆపేయటం ఏంటని అన్నారు. గత అసెంబ్లీలోనూ చూశాం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి చర్చ జరుగుతుంటే ఇదే విధంగా రచ్చ చేసి వాకౌట్‌ చేసిన ఘనత 
వాళ్లదని ఎద్దేవా చేశారు. ఈరోజు వాళ్ల నాయకుడు నుంచి వీళ్ల వరకు సిగ్గు ఉండాలి. దేనికి ఈ రచ్చ చేస్తున్నారు. అన్నిమాట్లాడుకుందాం. ప్రతిదీ మాట్లాడదామని మంత్ర అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రతిపక్షానికి సవాల్‌ విసిరారు. 
 
 
పసుపు-కుంకుమ దగ్గర నుంచి ఎక్కడెక్కడ దోపిడీ చేసిందీ మాట్లాడదామని అనిల్‌ అన్నారు. టీడీపీ సభ్యులను ఉద్దేశించి సిగ్గుండాలి... ఇలా చేశారు కాబట్టే 23 మందిని మాత్రమే ఇచ్చారు. ఈసారి ఆ 23 కూడా ఇవ్వరని అనిల్‌ 
హెచ్చరించారు. 
 
వీళ్ల జీవితం అంతా ఇంతే. ఏ రోజు కూడా పాజిటివ్‌ అనేది ఉండదు. ఎప్పుడు చూసినా నాకు తెల్సి (పరోక్షంగా ప్రతిపక్ష నేతను ఉద్దేశించి) ఏడుపు ముఖంతో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అనిల్‌ అన్నారు. 
వాళ్ల నాయకుడుకు నవ్వటం తెలీదు. ఎప్పుడు ఫేస్‌ చూసినా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడని అనిల్‌ అన్నారు. నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' నవ్వలేకపోవడం ఒక 'రోగం' అనే సామెతను అనిల్‌ గుర్తు 
చేశారు. ఆ రోగం టీడీపీ సభ్యులకు, వాళ్ల నాయకుడుకు ఉందని అనిల్‌ ఎద్దేవా చేశారు. బీసీ స్పీకర్‌గా ఉంటే రచ్చ చేయటం ఏంటని టీడీపీ సభ్యులకు సిగ్గుండాలని అనిల్ అన్నారు. 
 
బీసీల గురించి, ఎస్సీల గురించి మీరా మాట్లాడేది? ఇప్పుడు జోలె పడుతున్నారు. జోలె పట్టుకొని ఆడబ్బులు కూడా దోచుకోండని అనిల్‌ అన్నారు. గతంలో మొత్తం రాష్ట్రం అంతా దోచుకున్నారు.  కొత్తగా జోలె పడుతున్నారు. అక్కడ కూడా హుండీలు పెట్టారు. ఆ హుండీ డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలీదని అనిల్‌ తెలిపారు.

తిరుపతిలో హుండీ పెట్టారు. సెక్రటేరియట్‌లో హుండీ పెట్టారు. ఆ హుండీ డబ్బులు దొబ్బేశారని అనిల్‌ మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా జోలె ఎత్తుకొని వచ్చారని అనిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జోలె డబ్బులకు లెక్కలేదు. దానికి అమరావతి పరిరక్షణ కోసం నిధులు సేకరణ అట. పద.. పద.. ఉ.10.30 గంటలు టైం అయింది. జోలె ఎత్తండన్నారు. ఇంకా సిగ్గులేదు. వీళ్లు రైతుల్ని ఇంకా వంచన చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మితే గోచి కూడా ఉంచరు. ఆ గోచి కూడా లాక్కొని వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారని అనిల్‌ ఆగ్రహం చేస్తున్నారు.
 
2024 ఎన్నికలకు ఏ పార్టీతో టీడీపీ పొత్తుకు పోతుంది? అధికారంలో ఉన్న పార్టీ చంకన ఎక్కాలని చూస్తారు. 
వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తు లేకుండా వెళ్తుందా అచ్చెన్నాయుడుశ్రీ వైయస్‌ జగన్‌ సారధ్యంలో వైయస్ఆర్‌సీపీ ఒంటరిగా వెళ్తుంది. ఛాలెంజ్‌ చేసిన మంత్రి అనిల్‌ పొత్తులు లేకుండా టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదని.. ఏ పార్టీతో కలుద్దామా అని టీడీపీ ఆలోచిస్తుందని అనిల్‌ ఎద్దేవా చేశారు.
 
అచ్చెన్నాయుడు మా మంత్రి గారిని అడిగారు నెక్ట్స్‌ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రమాణం చేయమన్నారు. నేను అచ్చెన్నాయుడును అడుగుతున్నా.. నెక్ట్స్‌ మీ పార్టీ ఏ పార్టీ చంకన ఎక్కుతుందో చెప్పండయ్యా అని అనిల్‌ ప్రశ్నించారు. బీజేపీనా, సీపీఎం, సీపీఐయా, జనసేననా, ఇంకొకటా.. పొత్తు లేనిది ముద్ద దిగని మీరు కూడా మాట్లాడుతున్నారని మంత్రి అనిల్‌ ప్రశ్నలు సంధించారు.

పొద్దున లేస్తే ఏ పార్టీ అధికారంలో ఉందా? ఏ పార్టీ సంక ఎత్తుద్దామా? ఏ పార్టీ కాళ్లు మొక్కుద్దామా? రాహుల్‌ గాంధీనా, మోడీయా, ఇంకొక సీపీఎమ్మా, సీపీఐనా, ఆఖరికి ట్రంప్పా? మీరు కూడా పార్టీల మార్పు గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గు ఉండాలి. ఈరోజు కూడా చెబుతున్నాము. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు సింహంగా సింగిల్‌గా పోతాం తప్ప పొత్తుల కోసం వెళ్లమని అన్నారు.
 
మొదట చంద్రబాబు  ప్రమాణం చేసి 2024లో టీడీపీ పొత్తులు లేకుండా సింగిల్‌గా పోతుందని చెప్పే ధైర్యం ఉందా? అని అనిల్‌ ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యేకి.. కాదు టీడీపీ 23 మంది సభ్యులకి ఛాలెంజ్‌ చేస్తున్నా.. వైయస్ఆర్‌సీపీ శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారధ్యంలో సింగిల్‌గా ఎన్నికలకు పోతాం అని అనిల్ సవాల్‌ చేశారు. మిమ్మల్ని కూడా ఇదే ఛాలెంజ్‌ అడుగుతున్నామని అనిల్‌ అన్నారు. గొంతులేవదు.. మూగబోయిందని అనిల్‌ టీడీపీకి సవాల్‌ చేశారు.