శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (07:01 IST)

రష్యా ప్రధాని రాజీనామా

రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదెవ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు పని చేయాలని ఆయన మంత్రివర్గాన్ని దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కోరారు.

దిమిత్రి మెద్వెదెవ్ బుధవారం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు సమర్పించారు. దేశం కోసం గొప్ప కృషి చేశారని మెద్వెదెవ్‌ను పుతిన్ ప్రశంసించారు, ధన్యవాదాలు తెలిపారు.

ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు మెద్వెదెవ్‌ను డిప్యూటీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు పని చేయాలని మెద్వెదెవ్ మంత్రివర్గాన్ని పుతిన్ కోరినట్లు సమాచారం.

మంత్రివర్గం, రాజ్యాంగ సవరణలు అవసరమైన నేపథ్యంలో మెద్వెదెవ్ మంత్రివర్గం రాజీనామా చేసింది. అంతకుముందు మెద్వెదెవ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.