శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:23 IST)

7న ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 7వతేదీన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.  జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించడంతో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఆర్టికల్370, 35A గురించి మోడీ మాట్లడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలకు మోడీ ఫోన్ చేసి బిల్లుకు సపోర్ట్ చేయవలసిందిగా కొరారు. దీంతో ఆయా రాష్ట్రాల పార్టీలు బిల్లుకు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో జమ్మూ కశ్మీర్ బిల్లు పాస్ అవడం నల్లేరుమీద నడకగా మారింది.
 
 ఆర్టికల్ 370, 35Aని రద్దు చేయడం రాజ్యంగాన్ని కూని చేయడమేనని అన్నారు విపక్షనేత గులాం నబీ ఆజాద్. దీంతో పాటు సభను వాకౌట్ చేశారు కాంగ్రెస్ నేతలు. అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులో..  ఉమ్మడి జమ్మూ కశ్మీర్ ను… జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నారు.. దీంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా అవనుంది.