శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఆగస్టు 2019 (14:10 IST)

370, 35A: బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్స్

జమ్మూ కశ్మీర్ 370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఇందుకు ఆయా సీఎంలు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే BSP, అన్నాడీఎంకే మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. PDP పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో వారిని సస్పెండ్ చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేయగా.. బిల్లును JDU వ్యతిరేకించింది. కశ్మీర్ ప్రజలకు ఇప్పుడు న్యాయం జరిగిందని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఉమ్మడి జమ్మూ కశ్మీర్‌ను, జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు తెలుపారు.

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా కానుంది. అయితే కశ్మీర్ విషయంలో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు అమిత్ షా.