శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (13:24 IST)

ఉధృతంగా ప్రవహిస్తున్న మిథి నది-జలసంద్రంగా మారిన ముంబై

ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ముంబై నగరం జలసంద్రంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.


మిథి నది నీటిమట్టం ఆదివారం ప్రమాదస్థాయిని దాటింది. దీంతో అప్రమత్తమైన అధికారులు క్రాంతినగర్​లోని 400 కుటుంబాలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
 
ధారావీలో రాజా మెహబూబ్​షేక్​అనే యువకుడు వరద ప్రవాహంలో పడి గల్లంతైనట్లు సమాచారం. యువకుడి ఆచూకీ కోసం పోలీసులతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.


కాగా, మరో 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రం పైనుంచి బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.