అమ్మవారి రాష్ట్రంలో సుఖశాంతులతో ప్రజలు... గవర్నర్ నరసింహన్

narasimhan
ఎం| Last Updated: సోమవారం, 22 జులై 2019 (18:50 IST)
అమ్మవారు ఉన్న రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ హోదాలో చివరిసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వచ్చిన గవర్నర్ నరసింహన్ కు ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపడింతుల ఆశీర్వచనాల అనంతరం నరసింహిన్ కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... "చంద్రయాన్ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. ఇస్రో చైర్మన్ శివన్ కు, ఇస్రో బృందానికి అభినందనలు. ఇది భారతదేశం గర్వించదగిన విషయం" అన్నారు.
దీనిపై మరింత చదవండి :