ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (19:49 IST)

మంత్రి వనిత కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.

దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా.. ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు కూడా ఢీకొట్టి రహదారి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలతో బయటపడగా.. ద్విచక్రవాహనంపై ఉన్న వృద్ధుడు మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు భీమవరం ప్రాంతానికి చెందిన కలసూరి వెంకటరామయ్య (70)గా గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు