1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Steps towards fulfilling students' future: Minister Vanitha

విద్యార్థుల భవిష్యత్తును తీర్చే దిశగా చర్యలు: మంత్రి వనిత

Steps
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర స్త్రీ  శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లులు బాధ పడకూడదని, బ్రతుకులు మార్చే గుడి పాఠశాల అని, పాఠశాలలో చదివే పిల్లలకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, మన ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన పథకం అమ్మ ఒడి పథకమని అన్నారు.

కష్టపడి చదివించే తల్లులకు, చదివే పిల్లలకు ఈ పథకం ఒక సంజీవని లాంటిదని ఆమె తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని 200 పాఠశాలలు, కాలేజీలలో చదివే విద్యార్థిని విద్యార్థులు సుమారుగా 28,411 మంది ఉంటే వీరిలో 19 వేల ఐదు వందల నలభై మంది లబ్ధి పొందడం జరిగిందని తెలిపారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
తగ్గుతున్న బంగారం ధర?