శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:02 IST)

శ్రీశైలం డ్యామ్‌ క్రస్ట్‌ గేట్లు మూసివేత

ఎగువ నుండి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం క్రస్ట్‌ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాదాపు 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరో 50 వేల క్యూసెక్కులు వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా వ్యవసాయ అవసరాల నిమిత్తం తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను మూసివేసిన వెంటనే నాగార్జునసాగర్‌ గేట్లను కూడా మూసివేశారు. సాగర్‌కు ప్రస్తుతం 70 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు.