మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (08:49 IST)

హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ కేంద్రంగా హైటెక్ సెక్స్ రాకెట్ ఒకటి నడుపుతుంటే పోలీసులు దాన్ని పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్‌తో పాటు ఓ సీరియల్ నటిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 
 
బాలీవుడ్‌లో కొన్ని పెద్ద సినిమాల్లో కూడా నటించిన ఈ హీరోయిన్ కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ ఇక్కడ బడా బాబులతో ఎంజాయ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సడన్ అటాక్ చేసేసరికి గుట్టు బయటపడింది.
 
ఈ హీరోయిన్‌తో పాటు ఓ ఈవెంట్ మేనేజర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. హోటల్స్‌లో ఇలా వ్యభిచారం చేయిస్తూ గతంలో కూడా కొందరు ఈవెంట్ మేనేజర్స్ అడ్డంగా దొరికి పోయారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో వెలిగిపోదామని వచ్చిన అమ్మాయిలకు వలేసి కొందరు వ్యభిచార కూపంలోకి దించుతున్నారు.

మొన్నటికి మొన్న కూడా టాలీవుడ్ నటి ఒకరు హైదరాబాద్‌లో వ్యభిచార ఈవెంట్ నడిపిస్తూ దొరికేసింది. ఇప్పుడు మరోసారి ఇదే కథ జరుగుతుంది. సెక్స్ రాకెట్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుండటంతో .. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా ఛాలెంజింగ్‌గా మారుతుంది.

హీరోయిన్ అడ్డంగా దొరికిపోవడంతో ఆమెకు ఉన్న ఆఫర్స్ కూడా అన్నీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఆ హీరోయిన్ పేరు మాత్రం గోప్యంగా ఉంచారు.