1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Devineni Uma Maheswara Rao fire on Three Capitals

సోనియా బర్త్‌డేకు రెండు ముక్కలు.. జగన్ పుట్టిన రోజుకు మూడు ముక్కలు

Devineni Uma Maheswara Rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలైపోతోంది. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఇపుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే రోజున 13 జిల్లాలతో ఉన్న నవ్యాంధ్రను మూడు ముక్కలు చేశారనీ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. 
 
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై దేవినేని ఉమ స్పందించారు. 'నాడు సోనియాగాంధీ పుట్టినరోజున రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఇప్పుడు సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాజధానిని మూడు ముక్కలుగా విభజించారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జీఎన్‌ రావు కమిటీ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించిన దాఖలాలు లేవన్నారు. ఆ కమిటీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించక ముందే సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల మాజీ హోం మంత్రి చిన్నరాజప్ప అనుమానాలు వ్యక్తం చేశారు. అది జీఎన్‌ రావు కమిటీ కాదని... జగన్మోహన్‌ రెడ్డి కమిటీ అని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తర్వాతి కథనం
ఆస్ట్రేలియాలో భారత దంపతుల దుర్మరణం