1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Husband attempt suicide in West Godavari District

భార్య కూర సరిగా వండలేదని భర్త ఆత్మహత్య.. ఎక్కడ..?

West Godavari
భార్యాభర్తల గొడవలు సామాన్యమే. అయితే ఇక్కడో వ్యక్తి భార్యతో గొడవకు దిగాడు. కూర సరిగ్గా వండలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పిండివారిపాలెంకు చెందిన చింతల తిరుమలరావుకు రెండేళ్ల క్రితం నిర్మల జ్యోతితో పెళ్లైంది. వీరికి ఎనిమిది నెలల పాప కూడా ఉంది.

ఇదిలా ఉంటే గురువారం ఉదయం కూర సరిగా వండలేదన్న నెపంతో భార్యతో గొడవపడ్డాడు. ఈ కాసేపు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
 
ఆ తర్వాత పెడనలోని ఒకటవ వార్డులో ఉన్న అతడి స్నేహితుడు గోపీ ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుమలరావును స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడ్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
చిన్నపాటి కారణానికే ఆత్మహత్య చేసుకోవడంపై తిరుమలరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఐతే ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కూరవిషయమే కారణమా.. లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. 
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత గోరంట్ల!