ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (14:35 IST)

బెయిల్ కోసం ఎమ్మెల్సీ అనంతబాబు కోర్టులో పిటిషన్

crime scene
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా ఉన్న అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై విడుదలయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌కు 919/2022 అనే నంబరును కేటాయించారు. ఇది ఈ నెల 7వ తేదీన విచారణకు రానుంది. 
 
అదేసమయంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ పలు దళిత సంఘాలు కోర్టులో పిటిషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా, అనంతబాబుకు ఈ నెల 6వ తేదీతో 15 రోజుల రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని కాకినాడ సర్పవరం పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 
 
నిజానికి ఒక హత్య కేసులో అరెస్టు అయిన నిందితుడిని తక్షణమే తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సివుంది. కానీ, రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా పోలీసులు ఆ పని చేయలేదు. పైగా, రిమాండ్ ముగియనున్న నాలుగు రోజులకు ముందు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనుండటం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.