మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:56 IST)

ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాకిచ్చిన శాడిస్ట్ భర్త

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. శాడిస్టులా ప్రవర్తించాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి ఆడపిల్ల పుట్టిందని కరెంట్ షాక్ ఇచ్చాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పె

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. శాడిస్టులా ప్రవర్తించాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి ఆడపిల్ల పుట్టిందని కరెంట్ షాక్ ఇచ్చాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెనమలూరు పెద్ద గుడి ప్రాంతానికి చెందిన ప్రశాంతి, శ్రీలం రాజారత్నం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజాకు గతంలోనే వివాహమైంది. తొలి భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు.
 
విదేశాల్లో వుండి పనిచేసిన రాజా.. ప్రస్తుతం ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఇంటి వద్దే వుండి పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంతితో ప్రేమించి వివాహం చేసుకున్న రాజా దంపతులకు తొలుత బాబు పుట్టాడు. వరకట్నం కోసం భార్యను వేధించిన రాజాపై పోలీసులకు గతంలో ఫిర్యాదు కూడా అందింది. అయితే పెద్ద మనుషుల రాజీతో కేసును ప్రశాంతి ఉపసంహరించుకుంది. 
 
ఈ దంపతులకు ఇటీవల పాప పుట్టింది. ఆడ పిల్ల పుట్టడంతో భార్యపై కక్ష పెంచుకున్న రాజా.. ఈ నెల 2న గదిలో నిద్రిస్తున్న భార్య ప్రశాంతికి కరెంట్ వైర్లతో షాక్ ఇచ్చాడు. దీంతో కేకలు వేయడంతో రాజా పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న రాజా కోసం వెతుకుతున్నారు.