సంబంధిత వార్తలు
- ఐస్‌క్రీమ్‌లో మత్తుకలిపి... 17 యేళ్ళ బాలికపై సవతి తల్లి అన్న అత్యాచారం
- 'మహర్షి' మూవీ అప్డేట్స్ :: తీపి కబురు.. చేదువార్త... ఫ్యాన్స్ షాక్
- ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి అద్భుతం... అసలేం జరిగింది?
- ఒంటరిగా ఉన్న మహిళ... తలుపులు వేసి కోర్కె తీర్చమన్న యువకుడు
- తలనొప్పికి మసాజ్ చేస్తానని వక్షోజాలను పట్టుకున్న వైద్యుడు
ఆమెకు 48.. అతనికి 28... ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం వచ్చి చనిపోయిన టెక్కీ
ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితుడుని వెతుక్కుంటూ వచ్చిన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక అభ్యుదయ నగర్‌లోని ఒయో లాడ్జిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు హోటల్‌కు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో మృతురాలి పేరు సంగీత అని, ఆమె వెస్ట్ బెంగాల్ వాసిగా గుర్తించారు. పైగా, ఈ మహిళ టెక్కీగా పని చేస్తున్నట్టు కనుగొన్నారు.
అయితే, ఈమెకు మూడేళ్ళ క్రితం హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో లోకేశ్ కోసం హైదరాబాద్‌కు ఆమె వచ్చినట్టు భావిస్తున్నారు.
గత మూడు రోజులుగా వీళ్లిద్దరూ కలిసి ఒయో లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉన్నారనీ, మంగళవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ఆమెను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
దీంతో సీసీటీవీ ఫుటేజీలు, ఫేస్‌బుక్ చాటింగ్‌ల ద్వారా నిందితుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, సంగీత వయసు 48 సంవత్సరాల వరకు ఉండొచ్చని, లోకేశ్ వయసు 28 ఏళ్లని పోలీసులు వెల్లడించారు.
తర్వాతి కథనం
