శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (15:55 IST)

మద్యం సేవించడం మానేశాడనీ చావబాదిన స్నేహితులు

సాధారణంగా ఒకసారి మద్యానికి బానిసలైన తర్వాత తిరిగి దాన్ని వదిలిపెట్టడం అసాధ్యం. ఒకవేళ మధ్యలో మానేసినా తిరిగి దాని జోలికిపోకుండా ఉండలేరు. ఇలా మద్యానినికి బానిసలైన అనేక మంది తన జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి.
 
ఈ క్రమంలో ఓ వ్యక్తి మద్యం సేవించడం పూర్తిగా మానేశాడు. దీన్ని అతని స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా పెళ్లి అయ్యాక గత కొన్ని నెలలుగా అతను మిత్రులతో కలిసి మందు కొట్టడం లేదు. దాంతో అతనిపై పగ పెంచుకొని ఇంటికి వచ్చి మరీ చావబాదారు. ఈ దారుణ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది. 
 
వివాహం అయ్యాక తమ స్నేహితుడు మందు మానేసాడని, అతనిపై స్నేహితులు దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను కూడా చావగొట్టారు. మిత్రులంతా కలిసి అమృత్‌పాల్‌‌‌ను అతని ఇంటిముందు చావబాదారు. అంతేకాకుండా అడ్డువచ్చిన భార్య, అతని కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అమృత్‌పాల్‌‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.