బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:39 IST)

ప్రేమ పిచ్చోడు : ప్రియురాలి కోసం దొంగగా మారాడు

హైదరాబాద్ నగరంలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పిచ్చోడుగా మారిపోయాడు. ప్రియురాలి కోసం దొంగగా మారిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ సుల్తాన్ బజారుకు చెందిన బల్వీందర్ సింగ్ అనే యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. నగరంలోని కాచిగూడలో పలు భవనాలు ఉన్నాయి. ఈ భవనాల ద్వారా అద్దె రూపంలో నెలకు లక్షలాది రూపాయలు వస్తుంటాయి. 
 
అలాంటి సంపన్న కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఓ యువతి కోసం దొంగగా మారిపోయాడు. బెంగుళూరులో ఎంబీఏ చేస్తున్న ఓ యువతి ప్రేమలో పడిపోయి.. తన జీవితాన్నే కాదు తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. 
 
ప్రియురాలికి ఖరీదైన బహుమతులు కొనిచ్చేందుకు, ఆమె జల్సాల కోసం విరివిగా ఖర్చు చేయసాగాడు. ఇందుకోసం అవసరమయ్యే డబ్బులు చోరీలు మొదలు పెట్టాడు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడసాగాడు. ఎవరూ లేని ఇళ్ళకు కన్నాలు వేసి బీరావుల్లో భద్రపరిచిన బంగారు ఆభరణాలు చోరీ చేయసాగాడు. ఇలా ఓ ఇంట్లో చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో జైలుపాలయ్యాడు.